భూమ్మీద పడగానే శిశువు పలికే మొదటి మాట అమ్మ
క్రిందపడి దెబ్బ తగిలితే నోట వచ్చే మొదటి మాట అమ్మ
మన ఎదుగుదలని చూసి సంతోషపడే మొదటి వ్యక్తి అమ్మ
మనం పెడ దారి పడితే బాధ పడి సరిదిద్దే మొదటి వ్యక్తీ అమ్మే
దేవుని ప్రతిరూపం అమ్మ, దైవాన్ని మించింది అమ్మ
అందిస్తున్నా నీకిదే భక్తి సుమమాల అందుకోవా ఓ నా ప్రియమైన అమ్మా.
Uncategorized లో రాసారు | Leave a Comment »
ఇది మా ఫ్రెండుకు సంబంధించిన సమస్య. మావాడేమో బ్రాహ్మడు. తనకు 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. గత 4 సంవత్సరాలుగా వాడేమో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి కూడా వీడంటే లవ్వే. కానీ అటు మావాడి పెద్దలు కానీ ఆ అమ్మాయి వాళ్ళ పెద్దాళ్ళు కానీ ఒప్పుకుంటారని అనుకొవడం లేదు.
అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందో మీరయినా చెప్పండి. తరువాత వచ్చే కష్టాలు నష్టాలు వీటన్నిటికి వీళ్ళను ఎలా ఇబ్బంది చేస్తాయో దాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కోవాలో కొంచం చెబుదురూ ప్లీస్.
Uncategorized లో రాసారు | 4 వ్యాఖ్యానాలు »
నేను 5వ తరగతి నుంచి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల, కొడిగెనహళ్ళి లో చదివాను. మా బడి క్రమశిక్షణ కు పెట్టింది పేరు. మా బడి 1972వ సంవత్సరం ప్రారంభించబడింది. మేము చదివే రోజుల్లో అనంతపురం, కడప, కర్నూల్, చిత్తూర్, నెల్లూర్, ప్రకాశం జిల్లాలనుంచి విధ్యార్థులు వచ్చి చదువుకునేవారు. అంతా ప్రతిభావంతులే.
మా దినచర్య ఉదయం 5:00 గంటలకు మొదలయ్యి రాత్రి 9:00 గంటలకు ముగిసేది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకూ డ్రిల్ల్, యోగాసనాలు. 6 నుంచి 7 వరకూ స్నానం మరియు ఇతర కార్యక్రమాలు. 7 నుంచి 7:30 వరకూ ఉపాహారము/టిఫిన్.
7:30కు ఆ చదువుల తల్లిని స్మరిస్తూ మా ప్రార్థన ఇలా సాగేది.
“యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్ర వస్థ్రాన్వితా,
యా వీణా వరదండమండిత కరా యా శ్వేత పద్మాసనా,
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిహి దేవై సదా పూజితా,
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశేష్య జాడ్యాపహ…”
తరువాత మధ్యాహ్నం 12 గంటలకు భోజనం. మళ్ళీ 2 గంటలకు బడి మొదలయ్యి 4:30 కు ముగిసేది. 5 నుంచి 6:30 వరకూ ఆటలు. 6:30 నుంచి 7:00 వరకూ ఫ్రీ టైము. 7:00 నుoచి 7:30 మధ్యలో రాత్రి భోజనం. 7:30 నుoచి 9:00 వరకూ అందరూ తప్పకుండా చదువుకోవాలి. హొం వర్క్ ఉంటే చేసుకొవడమో లేక ఆరోజు చెప్పిన పాఠాలు మళ్ళీ చదవడమో చేసేవాళ్ళం.
అలా చదివినందుకేనేమో 10 క్లాస్ పరీక్షల్లో మా బడికి వచ్చినన్ని రాంకులు మరే బడికీ రాలేదంటే నమ్మండి. 1975 లో మొదలయిన రాంకుల వరద అలా ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.
మా బడి తయారు చేసిన ఆణిముత్యాల్లోనుంచి కొద్దిమంది పేర్లు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఎల్. వేణుగోపాల్ — ప్రముఖ హెచ్ ఆర్ ట్రయినర్
కే. రామక్రిష్ణా రావు– జిల్లా కలెక్టర్.
మా బడి అంతర్జాలం www.aprsk.org . మీకు వీలయితే తప్పక మా బడి వెబ్ సైటు చూడండి.
మా బడి లో రాసారు | 1 అభిప్రాయం »
ఈ పోస్ట్ ముఖ్య వుద్దేశ్యము ఏమిటంటే, ఇండియా లో హస్పెటల్స్ కి , ఆస్ట్రేలియా లోని హస్పెటల్స్ కి వున్న తేడాను చూపడమే.
అది 1988 ఆగష్ట్ మొదటి తారీఖు. మా అమ్మ పోయిన రొజు. తను నిజాంస్ హస్పెటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపొయారు. అప్పుడు హాస్పెటల్ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం డబ్బు కట్టి Body తీసుకెళ్ళమన్నారు. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళకు మానవత్వం అన్నదే లేదా అని.
అదొకటే అనుకుంటే 1993 లో మా నాన్న ను అదే హస్పెటల్ లో ఎమర్జన్సీ కండిషన్ లో చేర్పించాల్సి వచ్చింది. అప్పుడు కూడా పైన చెప్పిన విధంగానే డబ్బు కడితే తప్ప అసలు దగ్గరికి కూడా రాము అని చెప్పారు. సమయానికి నా దగ్గర 500 రూపాయలు మాత్రం వున్నాయి అప్పుడు. అవి కట్టి ట్రీట్మెంట్ చెయ్యమంటే కుదరదు మొత్తం 3000 రూపాయలు కట్టమని కచ్చితంగా చెప్పారు.
అది మన ఇండియా లో హాస్పిటల్ పరిస్థితి.
మరి ఆస్ట్రేలియా లో యెలా పరిస్థితి యెలావుందంటే
మొన్న మా ఆవిడకు ఆపరేషన్ అయ్యింది. అదికూడా ఒక ప్రయివేటు హాస్పిటల్ లో. తనని ఇంటికి తీసుకు రావడానికి వెళితే, హాస్పిటల్ వాళ్ళు అన్నారు, మీరెమైనా హాస్పిటల్ కు డబ్బు కట్టేదుంటే మీకు 3 వారాల తరువాత ఇంటికి బిల్లు పోస్టు చేస్తాము అప్పుడు కట్టండి అని.
ఆ క్షణం లో అనిపించిది ఎంతయినా తెల్లోడు తెల్లోడే అని. ఎందుకలా అనుకున్నానంటే, ఇక్కడ వీళ్ళకు నిజంగా మానవత్వం విలువ తెలుసు అని.
మీకెవరికయినా నాలా అనుభవం అయ్యుంటే తప్పకుండా మీ అనుభవాన్ని నాతో పంచుకోండి.
నా అనుభవాలు లో రాసారు | 2 వ్యాఖ్యానాలు »
మొన్న మా ఆవిడకు శస్త్రచికిత్స (అదేనండీ operation)జరిగింది. తను హాస్పెటల్ లో వున్నన్ని రోజులు నేను పడ్డ నిద్రలేని బాధే నా ఈ పోస్ట్ కు మూలం.
అసలేం జరిగిందంటే,
నాకు ముచ్చటగా ఒక అబ్బాయి(7 సంవత్సరాలు), ఒక అమ్మాయి (4 సంవత్సరాలు)వున్నారండి. మీకు తోకలేని కోతులు తెలుసా వీళ్ళు ఇద్దరూ ఆ జాతి వాళ్ళే. అక్కడ మా ఆవిడ తన బాధ ఏదో తను పడుతూ వుంటే ఇక్కడ నాకు మా తోకలేని కోతులతో బాధ మొదలయ్యింది. వీళ్ళని తయారు చేసి బడికి వాడిని, చైల్డ్ కేర్ కు పాపని పంపడానికి నేను పడ్డ బాధలు నా శత్రువు కు కూడా వద్దు. ఇద్దరు పిల్లలు మా ఆవిడ దగ్గర చేరిక ఎక్కువ. తను హాస్పెటల్ లో వున్నన్ని రోజులు నాకు నిద్ర లేదంటే నమ్మండి. మా అమ్మాయి కి టంచనుగా నాలుగు గంటలకి లేచి పాలు తాగి మళ్ళీ పడుకోవడం అలవాటు. మనకేమో ఒక్కసారి నిద్రనుంచి లేచామా మళ్ళీ నిద్ర పడితే ఆ రోజు నేను పండగ చేసుకోవచ్చు. అసలు నాకు నిద్రకూ వున్న అవినాభావ సంబంధం ఇప్పటిదా. నా చిన్నప్పుడు 8 గంటలకి సరిగ్గా పడుకునే వాడినని మా అమ్మ చెప్పేది. అలాంటి వాడిని ఇప్పుడు రాత్రి 12 అయినా నిద్ర రాదు. ఇంతా చేసి పడుకుంటే మా అమ్మయేమో 4 గంటలకి టంచనుగా లేపేస్తుంది. అబ్బాయేమో 7 గంటలకి నేను లేపితే తప్ప లేవడు. నేను సుఖంగా నిద్ర పొయేది కనీసం ఆ 4 గంటలు మాత్రమే.
సరే లేచిన తరువాత త్వరగా తయారు అవుతారా అంటే అదీ లేదు టీవీ లో కార్టూన్ ప్రోగ్రాం చూస్తూ టైం గడిపేసి ఆఖరు నిమిషంలో నా టెన్షన్ చూసి నన్ను నవ్వించాలని చూస్తారు.
ఇంతకీ నేను అడగొచ్చేదేంటంటే అందరి పిల్లలు ఇలాగే వుంటారా లేక మా కోతులు మాత్రం స్పెషలా మీరెవరయినా చెప్పండి ప్లీస్.
Uncategorized లో రాసారు | 7 వ్యాఖ్యానాలు »
ప్రపంచం లో వున్న అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.
ఇది నా మొదటి పోస్ట్. నాకు మీ ప్రోత్సాహం కావాలి.
Uncategorized లో రాసారు | 1 అభిప్రాయం »